కానిస్టేబుల్ ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఎర్ర చందనం స్మగ్లర్లు
- అన్నమయ్య జిల్లా చీనెపల్లె వద్ద దారుణం
- వాహనాన్ని అడ్డుకున్న కానిస్టేబుల్ ను ఢీకొట్టి, పరారైన స్మగ్లర్లు
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన కానిస్టేబుల్
ఈ సమయంలో ఎర్రచందనం తరలిస్తున్న వాహనం ఆ మార్గంలో వచ్చింది. వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేశ్ ప్రయత్నించాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు ఆయనను వాహనంతో ఢీకొట్టి, పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ గణేశ్ ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టి వాహనంతో పాటు, ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.