‘గుంటూరు కారం’ పోయింది అందుకే.. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి కామెంట్స్
- హీరోకు అనువుగా మూవీని మలిస్తే అపజయం తప్పదన్న సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి
- అందుకే ‘టాప్ హీరో’, ‘వజ్రం’ ఫలితం ఇవ్వలేదని వ్యాఖ్య
- ‘గుంటూరు కారం’ విషయంలోనూ ఇదే జరిగిందని కామెంట్
- కథనే నమ్ముకుంటే అపజయం ఉండదని స్పష్టీకరణ
‘‘ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో..అప్పుడు తేడా కొడుతుంది. ఇప్పుడు వచ్చిన గుంటూరు కారం చూడండి.. మహేశ్ బాబుకు తగ్గట్టుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ కిందా, మీదా పడిపోయారు. ఎప్పుడూ ఇలా చేయకూడదు. కథను నమ్ముకంటే ఫెయిల్యూర్ అనేదే ఉండదు. అందుకే యమలీల అంత పెద్ద హిట్ అయ్యింది’’ అని ఎస్వీ కృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు.