తాతకు 91వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన
- నేడు అపోలో ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు
- ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన
- ప్రతాప్ రెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన పుస్తకంపై స్పందన
"హ్యాపీ బర్త్ డే తాతా" అంటూ ప్రతాప్ సి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, ప్రతాప్ సి రెడ్డి జీవితంపై తీసుకువచ్చిన 'ది అపోలో స్టోరీ' పుస్తకం గురించి కూడా ఉపాసన ప్రస్తావించారు. "ఎల్లలు లేని కలలు కనే ప్రతి ఆడపిల్లకు, మగబిడ్డలతో సమానంగా కూతుళ్లకు మద్దతుగా నిలిచే తండ్రులకు ఈ పుస్తకం ఒక భావోద్వేగ నివాళి. ఈ పుస్తకం తీసుకువరావడంలో సహకరించిన అమర్ చిత్ర కథ సంస్థకు, రానా దగ్గుబాటికి కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశారు.