ఈ వారం బరిలోకి దిగుతున్న రజనీ 'లాల్ సలామ్'
- ఐశ్వర్య రజనీకాంత్ నుంచి 'లాల్ సలామ్'
- క్రికెట్ నేపథ్యంలో జరిగే అల్లర్ల చుట్టూ తిరిగే కథ
- అతిథి పాత్రలో కనిపించనున్న కపిల్ దేవ్
- ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల
విష్ణు విశాల్ - విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్య రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమాను రూపొందిస్తున్నారు. ఇది క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ. క్రికెట్ .. దాని నేపథ్యంలో జరిగే అల్లర్లు .. గొడవలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందువలన ఈ సినిమాలో కపిల్ దేవ్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. లైకా నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో రజనీకాంత్ మొయినుద్దీన్ భాయ్ అనే కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ ... లైకా వారు రిక్వెస్ట్ చేయడం వలన ఈ పాత్రను చేయడానికి రజనీ అంగీకరించారని అంటున్నారు. అయితే తెరపై రజనీ కనిపించేంతవరకూ ఆ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. రజనీ సోదరిగా జీవిత నటించిన ఈ సినిమాకి, సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్ అందించారు.