శ్రీమంతుడు వివాదం: మహేశ్ బాబుపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానంటున్న శరత్ చంద్ర
- తన కథను కాపీ కొట్టి శ్రీమంతుడు చిత్రాన్ని తీశారంటున్న రచయిత శరత్ చంద్ర
- కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు
- మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ పై కేసు వేసేందుకు సిద్ధమవుతున్న శరత్ చంద్ర
ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేశ్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. రచయిత శరత్ చంద్ర మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా శరత్ చంద్ర మాట్లాడుతూ... గతంలోనే తాను మహేశ్ బాబుకు నోటీసులు పంపానని... అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. మహేశ్ పై సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.