దిల్ రాజు సోదరుడి ఇంట పెళ్లి బాజాలు... జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం
- శిరీష్ తనయుడు ఆశిష్ కు త్వరలో వివాహం
- ఎన్టీఆర్ ను కలిసి పెళ్లి కార్డు అందించిన దిల్ రాజు
- ఆశిష్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్
ఆశిష్ రెడ్డి గతంలో రౌడీ బాయ్స్ అనే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. కాగా, ఆశిష్ ఓ ఆంధ్రా వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లాడబోతున్నట్టు తెలుస్తోంది. డిసెంబరులో నిశ్చితార్థం జరగ్గా... పెళ్లి ఫిబ్రవరిలో జరపనున్నట్టు సమాచారం.