మెగాస్టార్ కి శుభాకాంక్షల వెల్లువ!
- 'పద్మ విభూషణ్'తో పండగ వాతావరణం
- అభినందనలు అందుకోవడంతో మెగా స్టార్ బిజీ
- శుభాకాంక్షలు తెలియజేసిన నటుడు సాగర్
- రిలీజ్ కి రెడీగా ఆయన హీరోగా చేసిన 'ది 100'
అలా 150కి పైగా సినిమాలను పూర్తి చేసుకున్న చిరంజీవి, కొత్త దర్శకులను .. కొత్త నటులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలోని పేద కళాకారులను ఆదుకుంటూనే, అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి మెగాస్టార్ ను 'పద్మ విభూషణ్' పురస్కారం లభించింది. దాంతో పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు .. సినీ రంగానికి చెందిన స్టార్స్ సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొంతమంది చిరంజీవిని నేరుగా కలుసుకుని శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తాజాగా 'మొగలిరేకులు' ఆర్కే నాయుడు (సాగర్) చిరంజీవిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశాడు. సాగర్ హీరోగా చేసిన 'ది 100' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.