రేవంత్ రెడ్డిని కలవడంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివరణ
- ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
- తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా గన్‌మెన్లను కుదించడంతో ఇంటెలిజెన్స్ ఐజీని కలిసినట్లు వెల్లడి
- అదే అంశంపై రేవంత్ రెడ్డిని కలిశామన్న ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు కలిసినట్లు తెలిపారు. అలాగే ప్రోటోకాల్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. సీఎంను కలిసినంత మాత్రాన తమ నలుగురు ఎమ్మెల్యేలపై బురదజల్లడం మానుకోవాలని కోరారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా అని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని... మెదక్‌లోను పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.