జపాన్ డాన్ తో పుష్పరాజ్ ఫైట్ .. వేరే లెవెల్!
- షూటింగు దశలో 'పుష్ప 2'
- జపాన్ లో ప్లాన్ చేసిన షెడ్యూల్
- అక్కడ చిత్రీకరించనున్న యాక్షన్ ఎపిసోడ్
- ఆగస్టు 15వ తేదీన సినిమా రిలీజ్
ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశం నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నారు. 'పుష్ప' సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఇక్కడే షూట్ చేశారు. అయితే 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ సీన్ ను జపాన్ లో చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా సమాచారం.
కథ ప్రకారం పుష్ప ఒక భారీ డీల్ కోసం జపాన్ వెళతాడు. అక్కడ మాఫియా డాన్ తో డీల్ కుదరకపోగా, సీన్ రివర్స్ అవుతుంది. అక్కడి నుంచి పుష్ప బయటపడటమే కష్టమవుతుంది. ఈ సందర్భంలో .. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన విలన్ గ్యాంగ్ తో బన్నీ తలపడే ఒక యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారట. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది.