'వ్యూహం' సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసిన హైకోర్టు
- 'వ్యూహం' సినిమా చంద్రబాబును కించపరిచేలా ఉందని నారా లోకేశ్ పిటిషన్
- సినిమాను మరోసారి చూసి సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశం
- ఎగ్జామింగ్ కమిటీ, రివ్యూ కమిటీలు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచేలా ఉందంటూ ఆ పార్టీ యువనేత నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సినిమాను విడుదల చేవద్దని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది.