అయోధ్యకు బయల్దేరుతూ అభిమానులను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్
- అయోధ్యలో రేపు రామ మందిరం ప్రారంభోత్సవం
- చిరంజీవి, రామ్ చరణ్ లకు ఆహ్వానాలు
- ఈ సాయంత్రం అయోధ్య పయనమైన చిరంజీవి, రామ్ చరణ్
అంతకుముందు, చిరంజీవి తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది ఆ దేవుడు పంపిన ఆహ్వానంగా భావిస్తానని తెలిపారు. "ఆ అంజనాదేవి పుత్రుడు 'చిరంజీవి' హనుమంతుడు... భువిపై ఉన్న ఈ అంజనాదేవి పుత్రుడు చిరంజీవికి పంపిన ఆహ్వానం" అంటూ అభివర్ణించారు.

