బోయింగ్ విమానాల్లో ఆగని సాంకేతిక సమస్యలు.. ఆక్సిజన్ లీకేజీ కారణంగా స్విట్జర్లాండ్‌లో చిక్కుకుపోయిన అమెరికా విదేశాంగమంత్రి
- బోయింగ్ విమానాల్లో వరుసగా వెలుగుచూస్తున్న సమస్యలు
- ఆంటోనీ బ్లింకెన్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య
- వాయుసేన విమానాన్ని పంపి మంత్రిని వెనక్కి తీసుకొచ్చిన అమెరికా
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన ఆంటోనీ బ్లింకెన్ బుధవారం తిరిగి వాషింగ్టన్ చేరుకోవాల్సి ఉంది. అయితే, ఆయన ప్రయాణించాల్సిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడి ఆక్సిజన్ లీక్ అయింది. దీంతో స్విట్జర్లాండ్‌లోనే చిక్కుకుపోయారు. విషయం తెలిసిన అమెరికా ప్రభుత్వం వాయుసేన విమానాన్ని పంపి ఆయనను వెనక్కి తీసుకొచ్చింది.