భారత్‌తో టెస్ట్ సిరీస్ మొదలు కానున్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- భారత పిచ్‌లపై రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేసిన ఇంగ్లిష్ ఓపెనర్ బెన్ డకెట్
- అశ్విన్ లాంటి తెలివైన బౌలర్ తనను ఔట్ చేయగలడని వ్యాఖ్య
- గత కొన్నేళ్లలో పరిణతి చెందానని పేర్కొన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్
గత కొన్నేళ్లుగా క్రికెట్ లో చాలా నేర్చుకున్నానని, బ్యాట్స్‌మెన్‌గా పరిణతి చెందానని డకెట్ చెప్పాడు. టీమిండియా బౌలర్లు ఎలాంటి బంతులు సంధించినా సమర్థవంతంగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఉపఖండ పిచ్‌లపై బ్యాటింగ్ చేసిన అనుభవం తనకు కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత కొన్నేళ్లుగా తాను చాలా పరిణతి చెందినప్పటికీ అశ్విన్ లాంటి తెలివిగల వ్యక్తి తనపై పైచేయి సాధించగలడని డకెట్ పేర్కొన్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను తానొక్కడినే కాదని, అతడు చాలా బాగా బౌలింగ్ చేయగలడని అన్నాడు. ‘‘అశ్విన్ నన్ను మళ్లీ ఔట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. అయితే నేను దూకుడుగా ఆడకుండా లేదా స్వీప్ చేయకుండా జాగ్రత్తగా ఆడతాను’’ అని చెప్పాడు.