మూడో రోజు కూడా 'గుంటూరు కారం' కలెక్షన్ల జోరు
- మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో 'గుంటూరు' కారం
- తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్
- రెండ్రోజుల్లో రూ.127 కోట్ల గ్రాస్ వసూలు
- మూడో రోజు రూ.37 కోట్లు రాబట్టిన 'గుంటూరు కారం'
మొత్తమ్మీద ఈ మూడ్రోజుల్లో మహేశ్ బాబు సినిమా రూ.164 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న 'గుంటూరు కారం' చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఇందులో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది.