వన్డేలు, టీ20ల్లో ఆడే అర్హత అశ్విన్‌కు లేదు.. యువరాజ్ సంచలన వ్యాఖ్యలు
- ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో జరిగిన చాట్‌లో యువీ వ్యాఖ్యలు
- అశ్విన్ గొప్ప బౌలర్ అని ప్రశంస
- పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బౌలింగ్ ఒక్కటే సరిపోదన్న యువీ
యువరాజ్, అశ్విన్ ఇద్దరూ 2011 వన్డే ప్రపంచకప్ ఆడారు. సమయం వచ్చినప్పడల్లా యువరాజ్‌పై అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించేవాడు. భారత జట్టుకు అతడు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడేవాడు. యువీకి క్యాన్సర్ అన్న విషయం తెలిసినప్పుడు అశ్విన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.