ఏఐ టెక్నాలజీతో ఎంతో స్టయిలిష్ గా అక్కినేని నాగేశ్వరరావు... రామ్ గోపాల్ వర్మ ట్వీట్
- ఏఐ టెక్నాలజీతో అక్కినేనిని మోడ్రన్ గా చూపించిన వైనం
- వీడియో షేర్ చేసిన వర్మ
- ఇప్పటి హెయిర్ స్టయిల్స్, ట్రెండీ దుస్తుల్లో అక్కినేని
ఇక అసలు విషయానికొస్తే... ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఆసక్తికర స్లైడర్ వీడియో పంచుకున్నారు. ఇందులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావును ఎంతో స్టయిలిష్ గా మోడ్రన్ లుక్ తో చూపించారు.
ఇప్పటి హెయిర్ స్టయిల్స్, కండలు, టోన్డ్ ఫేస్, ట్రెండీ దుస్తుల్లో ఉన్న ఏఐ అక్కినేనిని ఈ వీడియోలో చూడొచ్చు. ఆర్టిఫీషియల్ ఏఎన్నార్ ను ఎంతో ఇంటెలిజెంట్ గా క్రియేట్ చేశారని వర్మ ఈ వీడియోపై వ్యాఖ్యానించారు.