రాజమండ్రిలో రఘురాజుకు ఘన స్వాగతం.. వందలాది కార్లతో భీమవరంకు భారీ ర్యాలీ
- హైదరాబాద్ నుంచి రాజమండ్రికి చేరుకున్న రఘురాజు
- పెద్ద ఎత్తున తరలి వచ్చిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
- నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వెళ్తున్న రఘురాజు
ఇక రఘురాజు కూడా అభిమానులకు ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు. రాజమండ్రి నుంచి భీమవరంకు ఆచంట, పాలకొల్లు మీదుగా ఆయన భారీ ర్యాలీగా వెళ్తున్నారు. వందలాది కార్లు రఘురాజును అనుసరిస్తున్నాయి. నాలుగేళ్ల తర్వాత ఆయన స్వస్థలానికి వెళ్తుండటం గమనార్హం. ఈ సంక్రాంతిని తన నియోజకవర్గంలో ఆయన బంధుమిత్రులతో కలిసి జరుపుకోనున్నారు.