తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్
- రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ
- ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ
- 29 న పోలింగ్.. సాయంత్రం ఓట్ల లెక్కింపు
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈమేరకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా ఈ రెండు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.