మావా ఎంతైనా పర్లేదు బిల్లు... మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు... 'గుంటూరు కారం' నుంచి మరో సాంగ్
- మహేశ్ బాబు హీరోగా గుంటూరు కారం
- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం
- జనవరి 12న రిలీజ్
- నిన్న గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
కాగా, ఈ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజైంది. "మావా ఎంతైనా పర్లేదు బిల్లు... మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు" అంటూ సాగే ఈ పాటకు తమన్ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. కొమాండూరి రామాచారి, శ్రీకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటలో 'ది గోంగూర బ్యాండ్' వినిపించిన ఆంధ్రా డప్పు దరువు స్పెషల్ అని చెప్పాలి. 'గుంటూరు కారం' చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు.