ఇకపై విజయ్ సేతుపతి అలాంటి పాత్రలు చేయడట!
- విలక్షణ నటుడిగా పేరున్న విజయ్ సేతుపతి
- హీరోగానే కాదు .. విలన్ గానూ బిజీ
- 'జవాన్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయం
- ఇకపై హీరోగా మాత్రమే చేస్తానని అన్నాడంటూ ప్రచారం
ఇక మరో వైపున ఆయన ఇతర భాషల్లోను కీలకమైన పాత్రలను .. విలన్ రోల్స్ ను చేస్తున్నాడు. తెలుగులో 'ఉప్పెన' సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా కనిపించాడు. ఆ పాత్రలో ఆయన నటనను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. అంతగా ఆయన తన ప్రభావం చూపించాడు. ఇక ఈ మధ్య బాలీవుడ్ లో 'జవాన్' సినిమాలోను కీలకమైన రోల్ చేసి, అక్కడి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
ఇలా ఆయన ముఖ్యమైన పాత్రలను పోషించిన కొన్ని సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాను విలన్ రోల్స్ గానీ .. గెస్టు రోల్స్ గాని చేయదలచుకోవడం లేదని విజయ్ సేతుపతి అన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇకపై అలాంటి పాత్రలకు తనని అడగొద్దని ఆయన చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.