బిడ్డను కోల్పోయిన కమెడియన్ అవినాశ్
- అవినాశ్ భార్యకు అబార్షన్
- సోషల్ మీడియాలో వెల్లడించిన కమెడియన్
- అమ్మానాన్న అనిపించుకోవడానికి ఎంతో ఆశగా ఎదురుచూశామని వెల్లడి
- కానీ ఈ ఘటన తమను విషాదానికి గురిచేసిందని వివరణ
తన భార్యకు అబార్షన్ జరిగిందని, బిడ్డ భూమ్మీదకు రాకుండానే కోల్పోయామని తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. బాధ అయినా, సంతోషం అయినా... తన జీవితంలో అభిమానులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, అందుకే ఈ విషాదకర వార్తను అభిమానులతో పంచుకుంటున్నానని అవినాశ్ వివరించాడు.
అమ్మానాన్న అనిపించుకోవాలని తాను, తన భార్య ఎంతో ఆరాటపడ్డామని, కొన్ని కారణాల వల్ల బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పాడు.