ప్రజాపాలన అభయహస్తంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఆందోళన అవసరం లేదన్న సీఎస్
- జనవరి 6వ తేదీతో ముగియనున్న ప్రజాపాలన
- నాలుగు నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన ఉంటుందన్న సీఎస్
- ప్రతి నాలుగు నెలలకు ఓసారి ప్రత్యేక సభలు నిర్వహిస్తామని స్పష్టీకరణ
ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి చెబుతూ, మరో నాలుగు నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి నాలుగు నెలలకు ఓసారి గ్రామాలు, పట్టణాలలో ప్రజాపాలన ప్రత్యేక సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.