షిరిడీలో 'కాకినాడ సుబ్బయ్య గారి హోటల్' ప్రారంభం... హాజరైన రఘురామకృష్ణరాజు, పట్టాభి
- కాకినాడలో 1950లో ప్రారంభమైన 'సుబ్బయ్య గారి హోటల్'
- నేడు దేశంలో అనేక నగరాలకు విస్తరించిన వైనం
- ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీలోనూ బ్రాంచి తెరిచిన నిర్వాహకులు
కాకినాడ కేంద్రంగా 1950లో ప్రారంభమైన 'సుబ్బయ్య హోటల్'... నేడు దేశంలో అనేక చోట్ల బ్రాంచిలు కలిగి ఉంది. 2018లో హైదరాబాదులో 'కాకినాడ సుబ్బయ్య గారి హోటల్' పేరిట మొదటి బ్రాంచి ప్రారంభం కాగా... అక్కడ్నించి దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించింది.
'కాకినాడ సుబ్బయ్య గారి హోటల్' లో ప్రత్యేకంగా వండే పనసపొట్టు బిర్యానీ ఎంతో ఫేమస్. ఇక్కడ అరటి ఆకులతో చేసిన బుట్టలలో ఆహార పదార్థాలను ఉంచి కస్టమర్లకు వడ్డిస్తారు. ఇది శాకాహార హోటల్.

