బెంగళూరు ఎయిర్ పోర్టులో పరస్పరం ఎదురైన చంద్రబాబు, డీకే శివకుమార్... వీడియో ఇదిగో!
- ఇవాళ కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు
- హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిన బాబు
- అదే సమయంలో నాగపూర్ వెళ్లేందుకు వచ్చిన డీకే
- కరచాలనం చేసుకుని కాసేపు మాట్లాడుకున్న నేతలు
హైదరాబాద్ నుంచి కుప్పం వెళ్లేందుకు బెంగళూరు వచ్చిన చంద్రబాబు విమానం దిగగా... అదే సమయంలో నాగపూర్ వెళ్లే విమానం ఎక్కేందుకు డీకే శివకుమార్ అక్కడికి వచ్చారు. ఇరువురు ఎదురుపడడంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు.
కరచాలనం అనంతరం చంద్రబాబు, డీకే శివకుమార్ కొద్దిగా పక్కకు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. దీనిపై టీడీపీ వర్గాలు స్పందించాయి. ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని, ఇద్దరూ మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారని స్పష్టం చేశాయి.