పేద విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన కేటీఆర్
- తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసిన పేద మహిళ అన్నపూర్ణ
- కుమార్తెను చదివించేందుకు ఇబ్బంది పడుతున్న ఇల్లెందు మహిళ
- రూ.1 లక్ష సాయం అందించిన కేటీఆర్
అన్నపూర్ణ పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్ చలించిపోయారు. ఆమె కుమార్తెకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు అన్నపూర్ణకు సొంతంగా రూ.1 లక్ష అందించారు. కుమార్తెను బాగా చదివించాలని సూచించారు. కేటీఆర్ నుంచి ఆర్థికసాయం అందుకున్న అన్నపూర్ణ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. అన్నపూర్ణను ప్రజాదర్బార్ పొమ్మంటే బీఆర్ఎస్ పార్టీ ఆదుకుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికే పరిమితమైనట్టు కనిపిస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది.