కనీసం బస్సుల సంఖ్యనైనా తగ్గించి ఆటో డ్రైవర్లను ఆదుకోండి: మంత్రికి ఆటో సంఘాల విజ్ఞప్తి
- మంత్రిని కలిసిన బీఎంఎస్ అనుబంధ ఆటో సంఘాలు
- ఉపాధిని కాపాడాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆటో యూనియన్ల విజ్ఞప్తి
- మహిళల ఉచిత ప్రయాణం విషయంలో పునరాలోచన చేయాలని విన్నపం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం విషయంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కనీసం బస్సుల సంఖ్యనైనా తగ్గించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. ఓలా, ఉబెర్, ర్యాపిడ్ బైక్‌ల అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలని మంత్రిని కోరారు. యూనియన్ల డిమాండ్లపై స్పందించిన మంత్రి... త్వరలో ఆటో సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.