మళ్లీ పెళ్లిపై సమంత రియాక్షన్ ఇదే!
- ఇన్ స్టాలో అభిమానులతో సామ్ చిట్ చాట్
- మీరు మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోకూడదని నెటిజన్ ప్రశ్న
- 2023 విడాకుల వివరాలతో జవాబిచ్చిన సామ్
- గణాంకాల ప్రకారం అది బ్యాడ్ ఇన్వెస్ట్ మెంట్ అంటూ కామెంట్
కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అంటూ సమంత ఓ ఇమేజ్ తో అభిమానికి జవాబిచ్చింది. అధికారిక గణాంకాల ప్రకారం.. మొదటి పెళ్లి విడాకుల శాతం 50.. రెండు, మూడో పెళ్లి చేసుకున్న వారిలో వరుసగా 67 శాతం, 73 శాతం మంది మళ్లీ విడిపోతున్నారని పేర్కొంది. స్త్రీ పురుషులు ఇద్దరి విషయంలోనూ ఇలాగే ఉందని సామ్ చెప్పింది. అందుకే, ఆ ఆలోచన బ్యాడ్ ఇన్వెస్ట్ మెంట్ కిందికి వస్తుందని వివరించింది. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా.. తనకు దేవుడిపై నమ్మకం ఉందని సామ్ తెలిపింది. ‘మీ రోజువారీ దినచర్యలోనే మీ విజయ రహస్యం దాగి ఉంటుంది’ అని కోట్ చేసింది. కాగా, సామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.