హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రేణుకా చౌదరి
- గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన రేణుకా చౌదరి
- బీఆర్ఎస్ నేతలు విశ్రాంతి తీసుకోవాలని సూచన
- ఇచ్చిన వాగ్ధానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని హామీ
బీఆర్ఎస్ నేతలు ఇక విశ్రాంతి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. తమకు రాని ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు కుళ్లుకొంటున్నారన్నారు. ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు రోజులు కాకముందే విమర్శలు మొదలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. ఉచితాలు ప్రజల సంక్షేమం కోసమని, దాని వల్ల సోమరిపోతులు అవ్వడం ఉండదన్నారు.