ప్రభాస్ 'సలార్' చిత్రానికి A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
- ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్
- తొలి భాగం సలార్: సీజ్ ఫైర్ డిసెంబరు 22న విడుదల
- సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న చిత్రం
- ఇటీవల వచ్చిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
కాగా, సలార్ రెండు భాగాలుగా వస్తోంది. మొదటి భాగం సలార్: సీజ్ ఫైర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇందులో ప్రథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు, టినూ ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.