కేసీఆర్ వాకర్‌తో నడుస్తుండటంపై నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్
- కేసీఆర్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్
- "మై రాక్ స్టార్" అంటూ కితాబు
- వాకర్‌తో నడుస్తున్న వీడియోను పంచుకున్న ప్రకాశ్ రాజ్
ప్రస్తుతం కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అవనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.