ఎన్టీఆర్ 31పై ప్రశాంత్ నీల్ కీలక కామెంట్.. అభిమానుల్లో ఉత్కంఠ
- ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ కొత్త మూవీ కథపై సర్వత్రా సస్పెన్స్
- యాక్షన్ మూవీ అయి ఉండొచ్చని అభిమానుల్లో చర్చ
- మునుపటి తన చిత్రాలకంటే ఎన్టీఆర్ 31 భిన్నమైనదన్న దర్శకుడు ప్రశాంత్ నీల్
- కథ ఎలాంటిదైనా జనాలకు కనెక్ట్ అవుతుందని వ్యాఖ్య
కేజీఎఫ్-3 గురించి కూడా ప్రశాంత్ నీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైందని వెల్లడించారు. కేజీఎఫ్-2కు సీక్వెల్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ సినిమా చివర్లో హింట్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ పార్ట్-1- సీజ్ ఫైర్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సలార్‌ను ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.