ఢిల్లీలో సీఎం అభ్యర్థి ఎంపికపై కీలక భేటీ.... గచ్చిబౌలి హోటల్లో రేవంత్ రెడ్డికి అధికారుల శుభాకాంక్షలు
- ఢిల్లీలో ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఠాక్రేల భేటీ
- దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా జోరుగా ప్రచారం
- గచ్చిబౌలి హోటల్లో రేవంత్ రెడ్డికి భద్రత పెంచిన పోలీసులు
రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల శుభాకాంక్షలు
మరోవైపు, రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు 48 గంటలుగా గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే ఉన్నారు. హోటల్ నుంచే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలియడంతో ఆయనకు హోటల్ లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే పలువురు అధికారులు కూడా టీపీసీసీ అధినేతను కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. హోటల్‌లో రేవంత్ రెడ్డి ఉండే గది వద్ద పోలీసులు భద్రతను పెంచారు.