శివాజీకి మాస్క్ ఉందన్న గౌతమ్ .. అది మానుకోమంటూ శివాజీ అసహనం!
- నిన్న ఎలిమినేట్ అయిన గౌతమ్
- శివాజీ చుట్టూ తిరగొద్దని ప్రశాంత్ కి సలహా
- అర్జున్ కి .. ప్రియాంకకి మాస్క్ లేదని వెల్లడి
- గౌతమ్ తీరు గురించి ప్రస్తావించిన శివాజీ
ఇక అమర్ అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడనీ, శోభకి కూడా కాస్త మాస్క్ ఉన్నట్టే అనిపిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. శివాజీ చుట్టూతిరగడం వలన, రావలసిన గుర్తింపు రాకుండా పోతుందనే విషయాన్ని గమనించమని ప్రశాంత్ తో అన్నాడు. ఇక శివాజీకి మాత్రం మాస్క్ ఉన్నట్టే అనిపిస్తుందని చెప్పాడు.
ఆ మాటకి శివాజీ అసహనాన్ని వ్యక్తం చేశాడు. "గౌతమ్ నిన్ను నేను మొదటి నుంచి గమనిస్తూ వస్తున్నాను .. నువ్వు ఓదార్పును కోరుకుంటావు. ముందు భయపడతావు .. ఆ తరువాత సపోర్టు కోసం వెతుక్కుంటావు. అలా ఎప్పుడూ చేయకు .. నీకు నువ్వుగా ఎదగడానికి ప్రయత్నించు. ఇక్కడ ఎవరూ ఏమీ చేయరు" అని అన్నాడు.