కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన యాంకర్ అనసూయ భరద్వాజ్
- మీరు నిజమైన నాయకుడు సర్.. ఎందరికో స్పూర్తినిస్తున్నారని కితాబు
- బలమైన ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నానని వ్యాఖ్య
- హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని వ్యాఖ్య
'మీరు నిజమైన నాయకుడు సర్... ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు. బలమైన ప్రతిపక్షంగా మీరు కూడా చేయాల్సింది ఉంటుంది. ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ఈ నగరంతో ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు.