దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడింది: గుత్తా సుఖేందర్ రెడ్డి
- పోలింగ్ రోజున సాగర్ డ్యాం పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారన్న గుత్తా
- ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని వ్యాఖ్య
- మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని ధీమా
మరోవైపు, ఈ ఘటనపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పోలింగ్ రోజున డ్యామ్ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారని ఆయన మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని అన్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని... ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు.