Yukthi Thareja: ఆరెంజ్ కలర్ డ్రెస్ లో అందాల సుందరి .. యుక్తి తరేజా లేటెస్ట్ పిక్స్!

Yukthi Thareja Special

  • మోడలింగ్ వైపు నుంచి వచ్చిన యుక్తి తరేజా 
  • 'రంగబలి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
  • గ్లామర్ పరంగా దక్కిన మంచి మార్కులు 
  • యంగ్ హీరోల జోడీగా అవకాశాలు వరించే ఛాన్స్ 


తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో చాలామంది కొత్త హీరోయిన్స్ పరిచయమయ్యారు. అయితే వాళ్లలో ఒకరిద్దరికి మినహా మిగతావారికి పరాజయాలు ఎదురయ్యాయి. చక్కని కనుముక్కు తీరుతో గ్లామర్ పరంగా వాళ్లు ఆకట్టుకున్నప్పటికీ, కథాకథనాల పరంగా వాళ్లు ఫ్లాపులను తట్టుకోక తప్పలేదు. అలాంటివారి జాబితాలో యుక్తి తరేజా ఒకరుగా కనిపిస్తుంది.యుక్తి తరేజా హర్యానా బ్యూటీ. టాలీవుడ్ తెరకి చాలామంది హీరోయిన్స్ మోడలింగ్ వైపు నుంచే వచ్చారు. అలా వచ్చిన అందగత్తెనే యుక్తి తరేజా. 'రంగబలి' సినిమాలో నాగశౌర్య జోడీగా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో లుక్ పరంగా ఆమె యూత్ హృదయాలను దోచేసింది. ఆ సినిమా ఫ్లాప్ కావడం వలన సహజంగానే ఆమెకి వరుస అవకాశాలు వచ్చిపడలేదు. తాజాగా యుక్తి ఫొటో షూట్ కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఆమె అందంగా మెరుస్తోంది. చేపల్లాంటి కళ్లతో .. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు కుదురులేకుండా చేస్తోంది. ఆకర్షణీయమైన రూపంతో అలా కట్టిపడేస్తోంది. కాస్త ఆలస్యమైనా ఈ బ్యూటీ తెలుగు నుంచి ఆఫర్లు అందుకోవడం ఖాయమేనని అనిపిస్తోంది.

Yukthi Thareja
Actress
Rangabali
Tollywood
  • Loading...

More Telugu News