క్రైస్తవుడు సీఎంగా ఉండాలనేది నా కోరిక: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి
- జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత బలంగా ఉండొచ్చనేది పాస్టర్లకు తెలుసు అంటూ వ్యాఖ్యలు
- ఇటీవల కాడినాడలో ప్రీక్రిస్మస్ వేడుకల్లో ప్రసంగించిన ఎమ్మెల్యే
- సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వ్యాఖ్యలు
‘‘ నేను, కన్నబాబు ఎమ్మెల్యేలుగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉండడానికి మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దేవుడి బలమే కారణం’’ అని ద్వారంపూడి అన్నారు. స్వేచ్ఛగా ఉండాలన్నా, ప్రార్థనలు చేసుకోవాలన్నా జగన్ సీఎంగా ఉండాలని వేడుకల్లో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత బలంగా ఉండొచ్చనేది పాస్టర్లు అందరికీ తెలుసునని, రానున్న రోజుల్లో క్రైస్తవవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.