విశాల్ 34వ చిత్రం నుంచి కీలక అప్ డేట్
- 'సింగం' ఫేమ్ హరి దర్శకత్వంలో విశాల్ 34వ చిత్రం
- డిసెంబరు 1న టైటిల్ వెల్లడి
- ఇటీవలే 'మార్క్ ఆంటోని' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్
'సింగం' ఫేమ్ హరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం గత ఏప్రిల్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్ సమర్పిస్తోంది.
తాజా అప్ డేట్ ను పరిశీలిస్తే ఓ వైపు స్టెతస్కోప్, మరోవైపు రివాల్వర్ కనిపిస్తున్నాయి. ఇందులో విశాల్ డాక్టర్ గా కనిపించనున్నట్టు అర్థమవుతోంది. ఇతర తారాగణం వివరాలు ఇంకా ప్రకటించలేదు.