వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
- నవంబర్ 1న ఇటలీలో లావణ్య, వరుణ్ ల పెళ్లి
- ప్రేమతో రెండు హృదయాలు ఒక్కటయ్యాయన్న చిరంజీవి
- ఒక అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నానన్న చిరు
మరోవైపు వీరి వివాహానికి సంబంధించిన ఒక ఫొటోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇటలీలో ఒక అందమైన సాయంత్రం. చాలా కాలం క్రితం జరిగింది కాదు. ప్రేమతో ఒకటైన రెండు హృదయాలు.. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను తీసుకొచ్చాయి. అలాంటి అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు.