బర్రెలక్కకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బేషరతు మద్దతు
- కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి బర్రెలక్క
- అన్ని వర్గాలు ఆమె వెంటే
- ఆమెకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన సీవీఎల్ నరసింహారావు
నిరుద్యోగులకు ప్రతినిధిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిల్చున్న ఆమెకు తాజాగా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సీనియర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించారు. ‘మా రక్ష’ బర్రెలక్కకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తోందని ఆ పోస్టులో ఆయన పేర్కొన్నారు.