ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులు క్షేమం.. బయటకు వచ్చిన ఫొటో ఇదిగో!
- 8 రోజులుగా టన్నెల్‌లోనే 41 మంది కార్మికులు
- పైపులైను ద్వారా ఆహారం అందిస్తున్న అధికారులు
- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
వారిని రక్షించేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఆరు అడుగుల వెడల్పాటి పైపులైన్ ద్వారా వారికి ఆహారం అందించారు. చిక్కుకుపోయిన కార్మికులు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు టన్నెల్‌లోకి ఓ కెమెరాను పంపిన అధికారులు దాని ద్వారా వీడియో తీశారు. కార్మికులందరూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.