హాలీవుడ్‌లోకి మన జగ్గూభాయ్.. వెళ్లమంటారా? అని అభిమానులకు ప్రశ్న
- విలక్షణ నటనతో దూసుకెళ్తున్న జగపతిబాబు
- హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందన్న జగ్గూభాయ్
- వెళ్లి దున్నేసి రావాలంటూ నెటిజన్ల కామెంట్
ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించారు. హాలీవుడ్ తనను పిలుస్తోందని, ఏమంటారని అభిమానులను అభిప్రాయం అడిగారు. ఆయన ప్రశ్నకు నెటిజన్లు సరదాగా స్పందించారు. హాలీవుడ్‌ను కూడా దున్నేసి రావాలని కొందరంటే.. ఇంగ్లిష్ వాళ్లు మిమ్మల్ని తట్టుకోగలరా? అని ఇంకొందరు సరదాగా కామెంట్ చేశారు.