బాబ్బాబు.. ఈ ఒక్క మ్యాచ్‌కు దూరంగా ఉండరా?.. అమితాబ్‌ను వేడుకుంటున్న టీమిండియా అభిమానులు
- భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూడొద్దంటూ అమితాబ్‌కు అభిమానుల విజ్ఞప్తి
- ఆయన చూస్తే మ్యాచ్ ఓడిపోతారని భయం
- డైలమాలో ఉన్నానన్న బిగ్‌బీ
సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన తర్వాత అమితాబ్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. తాను చూడకపోతేనే మనం గెలుస్తామని చెప్పారు. ఇది కాస్తా వైరల్ అవడంతో అభిమానులు పైవిధంగా స్పందిస్తున్నారు. దయచేసి ఈ ఒక్కసారి జట్టు కోసం త్యాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్లువెత్తుతున్న అభ్యర్థనలపై అమితాబ్ తాజాగా స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.