అల్లు అర్జున్ గురించి నేను అలా చెప్పలేదు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు: అనసూయ
- 'పుష్ప' సినిమాలో బన్నీ కొన్ని తప్పులు చేశాడని అనసూయ చెప్పినట్టు వార్తలు
- అనసూయపై ఫైర్ అవుతున్న బన్నీ ఫ్యాన్స్
- తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న అనసూయ
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి తన డ్యాన్స్ గురించి అల్లు అర్జున్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని... ఏవైనా తప్పులుంటే తన నెక్స్ట్ మూవీలో ఆ తప్పులను సరిచేసుకుంటారని 'పుష్ప' సినిమాలో కొన్ని మిస్టేక్స్ చేశాడని, 'పుష్ప2' సినిమాలో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటున్నాడని ఆమె చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో, అనసూయపై బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అనసూయ స్పందించింది. తాను అల్లు అర్జున్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పింది. తన మాటలను వక్రీకరించారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.