పురందేశ్వరిపై కారుకూతలు కూస్తున్నారు.. మోదీకి జగన్ నిజస్వరూపం తెలిసిపోయింది: రఘురామకృష్ణరాజు
- పురందేశ్వరిపై వైసీపీ నేతల మాటలు బాధను కలిగిస్తున్నాయన్న రఘురాజు
- ఇంత జరుగుతున్నా జగన్ పల్లెత్తు మాట అనడం లేదని మండిపాటు
- రాబోయే రోజుల్లో ఏపీలో 'జైలర్' సినిమా కనిపిస్తుందని వ్యాఖ్య
ప్రధాని మోదీకి జగన్ నిజస్వరూపం తెలిసిపోయిందని... రాబోయే రోజుల్లో ఏపీలో 'జైలర్' సినిమా కనిపించబోతోందని అన్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ తన సొంత కుమారుడే పోలీస్ ఉన్నతాధికారిగా ఉండి దొంగతనాలకు పాల్పడుతుంటే... వాటిని చూడలేక కొడుకునే చంపేస్తాడని... ఏపీలో ఇలాంటి దృశ్యాలే కనిపించబోతున్నాయని చెప్పారు.