రేపు కమలహాసన్ 'ఇండియన్-2' నుంచి ఇంట్రో... తెలుగులో రాజమౌళి చేతుల మీదుగా విడుదల
- కమల్, శంకర్ కాంబోలో ఇండియన్-2
- రెండున్నర దశాబ్దాల తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్
- రేపు సాయంత్రం 5.30 గంటలకు ఇంట్రో వీడియో రిలీజ్
నవంబరు 7న కమల్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, రేపు సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్-2 ఇంట్రోను చిత్రబృందం కమల్ అభిమానులకు కానుకగా అందించనుంది. కాగా, ఈ ఇంట్రోను కన్నడలో కిచ్చ సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో ఆమిర్ ఖాన్ రిలీజ్ చేస్తున్నారు.




