ఒక్కో మహిళ నుంచి జగన్ రూ. 1.82 లక్షలు దోచుకున్నారు: రఘురామకృష్ణరాజు
- జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వార్టర్ రూ. 200కి పెరిగిందన్న రఘురాజు
- అమ్మఒడి, చేయూత లబ్ధిదారులైన మహిళల భర్తలు రోజుకు క్వార్టర్ తాగుతున్నారని వ్యాఖ్య
- ప్రతి ఒక్కరూ తమ ఓట్లను చెక్ చేసుకోవాలని సూచన
ఈ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి ఒక్కో ఓటుకు రూ. 2 నుంచి 3 వేలను జగన్ ఇప్పిస్తాడని రఘురాజు తెలిపారు. ఈ సొమ్మును తీసుకుని ఓట్లు మాత్రం వైసీపీకి వేయొద్దని ఓటర్లను కోరారు. నాసిరకం మద్యం తాగి 35 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న వారు చాలా మంది మరణించినట్టుగా నివేదికలు ఉన్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేసిందని... ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా? లేదా? చెక్ చేసుకోవాలని సూచించారు.