రెండో వివాహం చేసుకోబోతున్న అమలాపాల్
- తమిళ దర్శకుడు విజయ్ తొలి వివాహం చేసుకున్న అమలాపాల్
- మనస్పర్థల కారణంగా 2017లో విడిపోయిన వైనం
- ఇప్పుడు తన స్నేహితుడు జగత్ ను వివాహం చేసుకోబోతున్న మలయాళ భామ
మలయాళ భామ అమలాపాల్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయింది. తమిళ, మలయాళ చిత్రాల్లో సైతం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. కెరీర్ టాప్ గేర్ లో దూసుకుపోతున్న సమయంలో తమిళ దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకుంది. అయితే, ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తన స్నేహితుడు జగత్ ప్రేమలో పడింది. తాజాగా అతడితో పెళ్లికి ఓకే చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.