అశ్వనీ అలా .. తేజ ఇలా .. నాకు మైండ్ పనిచేయలేదు: బిగ్ బాస్ పూజ
- బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయిన పూజ
- తాజా ఇంటర్వ్యూలో అశ్వని - తేజ ప్రస్తావన
- అశ్వనికి ఇన్ సెక్యూరిటి అని వెల్లడి
- తేజ చెప్పిన రీజన్ చాలా సిల్లీ అంటూ వ్యాఖ్య
పూజ మాట్లాడుతూ .. "తనతో మాట్లాడటం లేదని అశ్వని నన్ను నామినేట్ చేసింది. నేను అందరితో ఎలా ఉంటూ వచ్చానో, అశ్వనితో కూడా అలాగే ఉండేదానిని. ఆమెను అవైడ్ చేయడం .. కార్నర్ చేయడం జరగలేదు. నేను తనతో మాట్లాడటం లేదంటే, తను కూడా నాతో మాట్లాడటం లేదనే కదా అర్థం. ఆమె నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపించింది" అని అంది.
" అశ్వనికి ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది .. నేను తనతో అదే మాట చెప్పాను .. అదే విషయంపై నామినేట్ చేశాను కూడా. అయినా ఆ విషయాన్ని ఆమె ఒప్పుకోలేదు. ఇక తేజ విషయానికి వస్తే మరీ దారుణం. తాను పడుకుంటే నీళ్లు చల్లానని చెప్పి నన్ను నామినేట్ చేశాడు. ఆ రీజన్ విన్న తరువాత ఎలా రియాక్ట్ కావాలనేది కూడా నాకు అర్థం కాలేదు. ఇలాంటి ఒక సిల్లీ రీజన్ వలన, లైఫ్ లో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాను" అని చెప్పింది.