'దేవర' నుంచి దసరా స్పెషల్ పోస్టర్!
- 'దేవర'గా కనిపించనున్న ఎన్టీఆర్
- రెండు భాగాలుగా రానున్న సినిమా
- ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ ఎంట్రీ
- ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన కాస్ట్యూమ్స్ .. చేతిలోని ఆయుధం మొదటి నుంచి హైలైట్ అవుతూ వచ్చాయి. దసరా సందర్భంగా కూడా ఆయన చేతిలోని ఆయుధంపైనే ఫోకస్ చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ అభిమానులలో మరింత ఉత్కంఠను కలిగించేలా ఉంది.
'జనతా గ్యారేజ్' తరువాత కొరటాల - ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం, ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయమవుతూ ఉండటం .. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని వైపుల నుంచి ఆసక్తిని పెంచుతూ వెళుతోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది.